NTV Telugu Site icon

Bandi Sanjay: గంటలో మూడుసార్లు.. సంజయ్ ‘బండి’ తనిఖీలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు. ఈరోజు ఉదయం జాతీయ రహదారి మీద ఉన్న చౌటుప్పల్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఈ రాత్రికి మర్రిగూడ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పాల్గొనేందుకు వెళ్తుండగా.. ఒక గంట సేపటి వ్యవధిలో మూడుసార్లు బండి సంజయ్ వాహనాలు పోలీసులు తనిఖీ నిర్వహించారు. తంగేడుపల్లి, పుట్టపాక, చల్మెడ గ్రామాల్లో బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు.

Fire Accident: తంగళ్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను పెంచారు. నేతల వాహనాలను ఎక్కువగా తనిఖీ చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్‌ వాహనాన్ని మూడు సార్లు తనిఖీ చేయడం గమనార్హం.

Show comments