కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, ఎంఐఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగర్ వీధులు కాంగ్రెస్, ఎంఐఎం ఎంతగా దిగజారిన రాజకీయం చేస్తున్నాయో సాక్ష్యం చెబుతున్నాయన్నారు. బీజేపీ & ఎంఐఎం ఒక్కటే అని రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటూ తిరిగారు – కానీ జూబ్లీహిల్స్‌లో, ఒవైసీ బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఒక్కసారిగా అభ్యంతరం లేకుండా పోయిందా? ఇది డొల్లతనం కాకపోతే మరేమిటి? అని ప్రశ్నించారు.
Also Read:Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..
బీఆర్‌ఎస్ – బీజేపీ పొత్తు అనేది లేదు. ఆ అబద్ధపు కథ కాంగ్రెస్ – ఎంఐఎం ప్రచారంలో మాత్రమే ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అసలు సెట్టింగ్ ఏంటంటే, కాంగ్రెస్ ఒవైసీ ఒడిలో హాయిగా కూర్చోవడమని తెలిపారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎంఐఎం కనీసం అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా సాహసించలేదు. పెద్ద ఒవైసీ కాంగ్రెస్‌కు ఆదేశాలు ఇస్తారు. చిన్న ఒవైసీ బీఆర్‌ఎస్‌కు సందేశాలు చేరవేస్తారని మండిపడ్డారు.
Also Read:Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..
కాంగ్రెస్ & బీఆర్‌ఎస్ కొట్లాడుతున్నట్లు నటించవచ్చు, కానీ బీజేపీని ఆపడానికి ఇద్దరూ ఎంఐఎం నుండి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారని అన్నారు. మీరు ఎన్ని తెరవెనుక ఒప్పందాలు చేసుకున్నా సరే – బీజేపీ మీ కళ్ల ముందే ఆ స్థానాన్ని గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా సమాధానం చెబుతారని బండి సంజయ్ అన్నారు.
