బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేయంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణిలో సమస్యలు లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. సారు…కారు.. సిక్ట్సి పర్సేంటేజీ సర్కార్ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరు ఉందన్నారు. కాంగ్రెస్ ను లేపడానికే మోడీ మాకు మిత్రుడే అని కేసీఆర్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కి జిల్లా అధ్యక్షులు లేరని, బూత్ కమిటీలు లేవని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు.. అసెంబ్లీ కన్వీనర్లు ఉన్నారు.. మండల కమిటీలు ఉన్నాయి.. బూత్ కమిటీలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు మోడీకి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Japan: సెక్స్ వయోపరిమితిని పెంచిన జపాన్.. శతాబ్ధం నిరీక్షణ తర్వాత సంస్కరణలు..
కేసీఆర్ ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడని బండి సంజయ్ ఆరోపించారు. మోడీ కేబినెట్‌పై ఒక్క అవినీతి మరక లేదని ఆయన అన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో అవినీతి మరక లేని మంత్రి లేడని ఆయన అన్నారు. కేసీఆర్ ఏం చేస్తున్నారు.. రోజు వారీ షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. నీతి అయోగ్ సమావేశానికి వెళ్లరు… ప్రధాని వస్తె కలవరని ఆయన మండిపడ్డారు. మోడీ దోస్తీ అంటివి.. మోడీ నీకు(కేసీఆర్) ఎట్ల దోస్తీ అయ్యారు..? అని ఆయన ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఆత్మహత్యలపై బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ.. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులతో బలవంతంగా వ్యక్తి గత సమస్యలే ఆత్మహత్యకు కారణమని రాయించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అభ్యర్థులను కేసీఆర్ తయారు చేస్తున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చిందే కేసీఆర్ అని, ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనీ ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే.. చాలా సందర్భాల్లో రుజువైందన్నారు.
Also Read : Harish Rao : దేశంలో మూడు రకాల చెత్తను వేరు చేసే ఒకే ఒక్క పట్టణం సిద్దిపేట
