NTV Telugu Site icon

Bandi Sanjay: మహిళా బిల్లు విషయంలో ఆ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి..

Bandi Sanjay Comments

Bandi Sanjay Comments

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం పట్ల సంతోషంగా ఉంది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు.. మహిళా బిల్లు విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 5 దశాబ్దాల నాటిది.. 1975 లోనే లోక్ సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం దురదృష్టకరమని బండి సంజయ్ విమర్శించారు.

Read Also: Nawaz Sharif: భారత్ చంద్రునిపైకి చేరితే, పాక్‌ పక్క దేశాలను అడుక్కుంటోంది..

అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 జూలైలో తొలిసారిగా మహిళా బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ.. కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదు అని బండి సంజయ్ అన్నారు. ఆ తరువాత వాజ్ పేయి ప్రభుత్వం మరో మూడు సార్లు మహిళా బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేసిన కుట్రల వల్ల ఆమోదానికి నోచుకోలేక పోయిందన్నాడు. యూపీఏ ఛైర్ పర్సన్ గా పదేళ్ల పాటు పని చేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ పార్లమెంట్లో యూపీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఆమోదించలేక పోయారంటే కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read Also: Etela Rajender: రాష్ట్రంలో అర్ధరాత్రి కడుపు నొప్పొస్తే ట్యాబ్లెట్స్ దొరకయ్.. కానీ మందు బాటిల్స్ దొరుకుతాయ్..!

నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి పార్లమెంట్ లో పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నందున మహిళా బిల్లు ఆమోదం పొందడం ఖాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకించినా ఈ బిల్లును అడ్డుకోవడం అసాధ్యం మని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ మహిళా ద్రోహి పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది.. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ విధానాలను మానుకోవాలి.. అంతకంటే ముందే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని బండి సంజయ్ హితవు పలికాడు.