NTV Telugu Site icon

Bandi Sanjay: అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుక్రుతం

Bandi Sanjay

Bandi Sanjay

గత 500 ఏళ్లుగా యావత్ హిందూ సమాజం చిరకాల వాంఛ నెరవేరబోతున్న ఘట్టం మరి కొద్ది గంటల్లోనే వచ్చింది అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని హిందూ సమాజమంతా ఎదురు చూస్తోంది.. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎంతో మంది దీక్షలు తీసుకున్నారు.. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేవాలయాలన్నీ ముస్తాబయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇంటింటా రామ నామ స్మరణ మారుమోగుతోంది.. మధ్యాహ్నం జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట ద్రుశ్యాన్ని వీక్షించి తరించండి.. రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది అని బండి సంజయ్ తెలిపారు.

Read Also: Saikata Sculpture of Lord Rama: రంగంపేటలో ఆకట్టుకుంటున్న శ్రీరాముని సైకత శిల్పం

ఈరోజు ప్రతి హిందువు తమ తమ ఇండ్ల ముందు 5 రామ జ్యోతులు వెలిగించండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా టపాసులు పేల్చి దీపావళి సంబురాలు చేసుకునేందుకు సిద్ధం కండి.. సాయంత్రం కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాలో దీపావళి సంబురాలు చేసుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఆర్టిస్ట్ వెంకటేశ్ రూపొందించిన సైకత అయోధ్య రామ మందిరాన్ని వీక్షించాలని కోరుతున్నాను.. అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుక్రుతం అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.