Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. సోషల్ మీడియాలో ఫోర్జరీ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రచారంలో ఉన్న లేఖపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దొంగ పాస్ పోర్టులు తయారు చేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం కష్టం కాదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు ఫోర్జరీ లేఖను రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఎన్ని చేసినా మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ చేస్తున్న అబద్దాల ప్రచారాలు నవంబర్ 3తో ముగింపు అన్నారు. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుందని జోస్యం పలికారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.
Read Also: Phone to MLA Please Resign: రాజీనామా చేయి సార్.. మేం అభివృద్ధి చెందుతాం
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇదిలా ఉంటే.. బండి సంజయ్ రాజీనామా పేరుతో ఫోర్జరీ లేఖను సృష్టించిన వారిపై ఎన్నికల సంఘానికి, పోలీసులుకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక, ఫోర్జరీ లేఖలో.. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అయినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ సమాచారం ఇచ్చినట్టుగా ఉంది. ఎన్నికల ఫలితాలు మనకు అనుకూలంగా లేనందున మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉండాలని అన్ని కేంద్ర నాయకత్వాలకు సూచించానని చెప్పినట్టుగా ఉంది. మునుగోడులో పార్టీకి ఓటమి ఎదురు కానుందని.. అందుకు బాధ్యత తనదేనంటూ బండి సంజయ్ వివరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
After the Farm House Drama of buying of MLAs flopped, frustrated TRS fraudsters now released a fake letter.
TRS tryst with lies would end on 3Nov as BJP is set for a record win at Munugode which will lead to a real resignation of KCR from public life.
TRS days are numbered pic.twitter.com/S8WB4haAUM
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 1, 2022
- Tags
- bandi sanjay
- bjp
- kcr
- Munugodu
- resign
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!