ప్రజాసంగ్రామ యాత్ర పేరిటి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ ప్రస్తుతం 5వ విడత పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. ఈ పాదయాత్ర రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. రేపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. కరీంనగర్ లో జరిగే ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. 3.40 కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుని..4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి 5.35కు బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read : 2022 గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో టాప్‌లో నిలిచిన దక్షిణాది భామలు వీరే!
మొదట జేపీ నడ్డా ఈ నెల 16న వస్తారని ప్రచారం జరిగినా..ఆ రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో బహిరంగ సభ షెడ్యూల్ ఈనెల 15 కు మారింది. దీంతో రెండు రోజులు ముందుగానే బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. రేపటి బహిరంగ సభను విజయవంతం చేస్తామని బండి సంజయ్ అన్నారు. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ బీజేపీకి అడ్డా అని నిరూపిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలను ప్రజల్లోకి పంపుతామని చెప్పారు.