Site icon NTV Telugu

Bandi Sanjay: పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణాది నుంచి ఏకైక ప్రధాని

Bandi Sanjay

Bandi Sanjay

నేడు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని ఆయన పేర్కొన్నారు.

Read Also: ICC World Cup 2023: సచిన్ కోసం 2011 ప్రపంచకప్‌ గెలిచాం.. 2023 ట్రోఫీ అతడి కోసం గెలవండి: సెహ్వాగ్

తెలంగాణ ముద్దు బిడ్డ.. ఆయన జీవితం అందరికి స్ఫూర్తిదాయకం అని టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పీవీ ప్రధాని కావడం తెలంగాణకు గర్వకారణం.. దేశ వ్యాప్తంగా పీవీ జయంతుత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పీవీ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచింది.. దహన సంస్కారాలు కూడా చేయలేక పోయింది.. కాంగ్రెస్ నాడు… అవమానిస్తే, కేసీఆర్ ఈరోజు పీవీనీ అవమానిస్తున్నాడు అని బండి సంజయ్ విమర్శించాడు.

Read Also: MadhyaPradesh: నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీని స్మరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏమైంది.. కేసీఆర్ పక్క పొలిటీషియన్.. ఓట్లు దండుకొవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కాదు కేసీఆర్ కింద ఉన్న కుర్చీకి విలువ ఇస్తున్నామన్నాడు.

Read Also: CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..

కాంగ్రెస్ పార్టీ పీవీ నర్సింహారావును అవమానించింది.. బీఆర్ఎస్ ఇప్పటికి అవమానిస్తూనే ఉంది.. గతంలో పీవీ ఘాట్ ను కూల్చేస్తామని కొందరు మూర్ఖులు అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ ఇప్పుడు కాక ఇంకేప్పుడు అడుగుతాడు అని బండి సంజయ్ ప్రశ్నించారు. నేటికి మన దేశంలో పీవీ ప్రవేశ పెట్టిన సంస్కరణలే కొనసాగుతున్నాయని అన్నాడు.

Exit mobile version