Site icon NTV Telugu

Bandi Sanjay : ఐఏఎస్‌లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా..?

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో.. ఐఏఎస్ లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని, కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారన్నారు. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోందని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా? అని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని, ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాదే అని బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్.. మేధావులారా…. బాకీల సర్కార్ ను బండకేసి బాదండి.. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని ఆయన అన్నారు.

Mahakumbh: కుంభమేళా స్టార్ట్స్.. అందంతో మోనాలిసా, వేప పుల్లలమ్మి ఫేమస్ అయిన ఆకాశ్

అంతేకాకుండా..’ఇకపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీనే.. ఓట్లు అడిగే బీజేపీకే ఉంది.. ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు వెళ్లింది బీజేపీ కార్యకర్తలే.. ఏనాడైనా టీచర్లు, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడిందా? ..బీఆర్ఎస్ పనైపోయింది…. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది.. కాంగ్రెస్ తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది,.. క్రైస్తవుల్లో చాలా మంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారు.. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?.. మేధావులారా…. కాంగ్రెస్ ను ఓడించండి… బీజేపిని గెలిపించండి’ అని బండి సంజయ్‌ అన్నారు.

Apple MacBook Air M1: బంపర్ ఆఫర్.. ఆపిల్ ల్యాప్ టాప్ పై రూ. 28 వేల డిస్కౌంట్..

Exit mobile version