NTV Telugu Site icon

Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో బండి సంజయ్ భేటీ

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్ది సేపటి క్రితం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్ అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట(హసన్ పర్తి) నుంచి కరీంనగర్ కు కొత్త రైల్వే లైన్ ను నిర్మించాలని ఆయన కోరారు. దీంతో పాటు ఈనెల 8న వరంగల్ లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్ కు సంబంధించి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అశ్వినీ వైష్ణవ్, బండి సంజయ్ తో చర్చించారు.

Read Also: TS BJP: హైదరాబాద్ కు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ఢిల్లీలోనే బండి సంజయ్

అనంతరం ఖాజీపేట(హసన్ పర్తి) నుంచి కరీంనగర్ కు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. సానుకూలంగా స్పందించిన అశ్వినీ వైష్ణవ్ వెంటనే ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాంతో పలువురు నేతలు పాల్గొన్నారు.

Read Also: Virat Kohli: కోహ్లి ఆ షాట్పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!

మరోవైపు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడంతో తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడంతో పలు అనుమానాలకు దారి తీసింది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో బండి సంజయ్ హస్తినలోనే ఆగిపోయారు. కాగా.. తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశంలో పాల్గొన్నారు.