8న ఉదయమే వచ్చి గ్రౌండ్ లో ఉండాలని, కేసీఆర్ అంటే మోసం మోడీ గారు మన బాస్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ నన్ను శభాష్ అన్నారు.. నన్ను అంటే మిమ్ముల్ని అన్నట్టేనని పార్టీ శ్రేణులకు వెల్లడించారు. వరంగల్ లో మళ్ళీ శభాష్ అనాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని ఆయన విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకరో ఇద్దరో చేరినంత మాత్రాన కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన మండిపడ్డారు.
Also Read : Maharashtra: బీజేపీ మార్క్ రాజకీయం.. రెండేళ్లలో ప్రతిపక్ష కూటమి కకావికలం..
పేదప్రజల సంక్షేమమే బీజేపీ ఎజెండా అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం స్థాపనే బీజేపీ లక్ష్యమని, బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళే తన్నుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభ కంటే రెట్టింపు స్థాయిలో వరంగల్ సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సౌ, దోసౌ, బీరు బిర్యానీ ఇచ్చే పార్టీ బీజేపీ కాదని, కష్టపడి పని చేసి సభను సక్సెస్ చేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు మోరుగుతూనే ఉంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పని చేసే వారిని గుర్తిస్తాం… అందుకు అబ్జర్వర్ లను పెడుతామని, పార్టీ కోసం పనిచేసిన వారికే గుర్తింపు ఇచ్చి ఏ టిక్కెట్లు ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Also Read : Kajal Agarwal : నెటిజెన్ అడిగిన ఆ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్..