ప్రజాసంగ్రాయ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల లో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణకు పట్టిన శని పోయిందన్నారు. పోలీసులకు ప్రమోషన్లు, బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, కేసీఆర్‌ను పార్టీ వాళ్ళను ముందు కొట్టేది పోలీసులే అని ఆయన వ్యాఖ్యానించారు. జాగా ఉంటే మూడు లక్షల ఇస్తా అన్నాడు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గ్రూప్ 1 కూడా నిర్వహించలేని వ్యక్తి కేసీఆర్ అని, ఎంఐఎంతో చట్టాల పట్టలేసుకుని తిరుగుతుండు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. గాలి నీరు నిప్పు చెట్టు పుట్ట అన్నింటిలో దేవుణ్ణి పూజించే ధర్మమే హిందూ ధర్మం అని, ధర్నాన్నీ కించపరిస్తే ఊరుకోమన్నారు. అబ్ కి బార్ సర్కార్ కాదు అది ఆబ్కారీ సర్కార్ లిక్కర్ సర్కార్ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ తల్లినే మోసము చేసిండు కేసీఆర్ అని, తెలంగాణ తెచ్చింది బీజేపీ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Rifle Competition : జాతీయ రైఫిల్ ఈవెంట్‌కు ఎంపికైన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని
చిన్నమ్మ సుష్మాస్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. పుట్టబోయే బిడ్డపై కూడా లక్షా ఇరవై వేల అప్పు కేసీఆర్ పెట్టిండు అని ఆయన మండిపడ్డారు. లిక్కర్ దందానే కాదు క్యాసినోలో కూడా కవిత పెట్టుబడులు పెట్టిందని, కేంద్రానికి సీఎం కేసీఆర్ సహకరించట్లేదని, కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ అవుతున్నాయన్నారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. మీకు సీఎం అయ్యే సత్తా లేదా మీరు సీఎం పదవికి అర్హులు కదా అని ఆయన అన్నారు. తెలంగాణలో కాషాయపు రాజ్యం రావాలని, నమస్తే బదులుగా పిల్లలకు జై శ్రీరామ్ నేర్పాలన్నారు బండి సంజయ్.