Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్‌పై హత్య కేసు నమోదు చేయాల్సిందే..!

Bandi Sanjay Bjp

Bandi Sanjay Bjp

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈరోజు వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు.
Also Read : IT Companies Lay offs: మొన్న.. ట్విట్టర్. నిన్న.. మెటా. నేడు.. ‘‘సిస్కో’’?

ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని కుర్చీ వేసుకుని కుర్చొని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది?. మళ్లీ అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆరే. పంట చేతికొచ్చే సమయానికి దాడులు చేసి పంటను నాశనం చేయించేది కేసీఆర్.
Also Read : MLA Jagga Reddy : కేంద్రం ఈడీ, కేసీఆర్ ఏసీబీ వాడుతున్నారు.. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేం చేస్తాం

సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడు. సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారు. బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడు. తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నడు.
Also Read : Supreme Court: ఈసీ నియామకంపై సుప్రీం అసహనం.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు?

కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా. లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోచుకుని అడ్డంగా దోచుకుంటున్నరు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.

ఐటీ, సీబీఐ, ఈడీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు. ప్రజలను రాచిరంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా?… రాజకీయ విమర్శలు చేసే వాళ్లు సమాధానం చెప్పాలి. అక్రమార్కులను పార్టీలకు అపాదించడం కరెక్ట్ కాదు. అక్రమార్కుల మీద దాడులు చేస్తే అడ్డుకోవడమేంది?

అధికారులు తనిఖీలు చేస్తే నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉంది. అది చేతగానివాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ రాజకీయ రంగు పులుమతారు. అవినీతి తిమంగలాలను వదిలిపెట్టాలా? అవినీతి పరులు తప్పించుకోవడానికి ఏదో ఒక విమర్శలు చేయడం సిగ్గు చేటు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. బీజేపీ ఎంపీపైనా కూడా దాడులు చేశారు కదా… వాటికి పార్టీలతో పనిలేదు.’ అని బండి సంజయ్‌ అన్నారు.

Exit mobile version