NTV Telugu Site icon

Bandi Sanjay Kumar: చిల్లర ఆటలు ఆపి హామీలు, వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి

Telangana Bjp President Bandi Sanjay Kumar Twitter

Telangana Bjp President Bandi Sanjay Kumar Twitter

Bandi Sanjay Kumar: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ నిర్ణయం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వలేదనే కారణంతో ఒక వీధి పేరును మార్చడం ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రతీకారాత్మక చర్యగా ప్రవర్తించడం చూస్తుంటే నవ్వేలా ఉంది. ఇది పిల్లల ఆటనా? ప్రజాస్వామ్యంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఓ వ్యక్తి ఈ స్థాయిలో వ్యవహరించడం తగినదేనా? అంటూ కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు.గద్దర్ అంటే తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమే. కానీ, ఆయన జీవితాంతం ఎవరిచే అవమానించబడ్డారు? నక్సల్స్‌ను సమావేశానికి పిలిచేందుకు గద్దర్‌ను సంభాషణకర్తగా ఉపయోగించుకున్నది కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు.

Also Read: Gas Cylinder Price : బడ్జెట్ కు ముందే వినియోగదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన సిలిండర్ ధర

అలాగే గద్దర్‌పై UAPA కేసు వేసింది, 21 కేసులు నమోదు చేసి.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు అదే పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆయనను గౌరవించినట్లు నటించడం ఎంత వాస్తవం? అంటూ ఎద్దేవా చేసారు. గతంలో నక్సలిజం కారణంగా ఎందరో నాయకులు, పోలీస్ అధికారులు, కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దుడిల్ల శ్రీపాద రావు, చిట్టెం నరసింహ రెడ్డి వంటి నాయకులు, అనేక మంది పోలీస్ కుటుంబాలు నక్సలిజం బాధితులుగా మారారు. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మీరు బాధిత కుటుంబాల కంటే రాజకీయ లబ్ధి గురించే ఎందుకు ఆలోచిస్తున్నారని అన్నారు.

Also Read: IND vs ENG 4th T20: సిరీస్ కైవసం.. ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం

పేర్ల మార్పు మీకు అంత ప్రాధాన్యం ఉంటే.. ఓ వీధిని కాకుండా నిజమైన చరిత్రను ప్రతిబింబించేలా హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, నిజామాబాద్‌ను ఇందూరుగా, పాలమూరు జిల్లాకు అసలైన పేరు తీసుకురాగలరా? అంటూ పేర్కొన్నారు. ఈ చిల్లర రాజకీయాలు ఆపి.. ఆరు హామీలు, 420 నకిలీ వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టండని చురకలు అంటించాడు. తెలంగాణ మీ వ్యక్తిగత రాజకీయ ప్రయోగశాల కాదు. ప్రజల భవిష్యత్తును ఆలోచించండి, లేదంటే ప్రజలే మీకు గుణపాఠం నేర్పిస్తారని అన్నారు.