Site icon NTV Telugu

Bandi Sanjay : పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పని చేసే వ్యక్తి కిషన్ రెడ్డి

Bandi Sanjay Resigned

Bandi Sanjay Resigned

పార్టీ కోసం కమిట్ మెంట్ తో పని చేసే వ్యక్తి కిషన్ రెడ్డి అని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపేందుకు కారణం కిషన్ రెడ్డి అని అన్నారు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నన్ను రారా పోరా అని పిలచేది కిషన్ రెడ్డి గారేనని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో గడిల, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా అయన నేతృత్వం లో పనిచేస్తామని బండి సంజయ్‌ వెల్లడించారు. సోషల్ మీడియాలో మాకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం నీ ఆపాలని కోరుతున్నానని, ఆ ప్రచారం వల్ల అయ్యేది లేదు పోయ్యేది లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు

పార్టీ నేతలకు వ్యతిరేకంగా వ్యవహరించడం నేరం అవుతుందని, మోడీ నాయకత్వం లో అందరం కలిసి ముందుకు వెళ్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు సరికాదు.. ఇక్కడ అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రామరాజ్య పాలన తెచ్చే విధంగా పని చేద్దామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పెద్దలు, మా అందరి నాయకుడు కిషన్ రెడ్డి గతంలో పని చేసిన విధానాన్ని మనమంతా చూశామని, కిందిస్థాయి నుండి ఢిల్లీ వరకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే తెలంగాణ ఆవిర్భవించాక ఇక్కడా పార్టీని శక్తిమంతంగా తయారు చేశారన్నారు.

Also Read : Monthly Pension: పెళ్లికాని వారికి పెన్షన్ ఇచ్చేది అప్పటి నుంచే.. క్లారిటీ ఇచ్చిన సీఎం..!

Exit mobile version