Site icon NTV Telugu

Bandi Sanjay : కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే

Bandi Sanjay Resigned

Bandi Sanjay Resigned

ట్విట్టర్ టిల్లు.., కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటున్నారో మొత్తం దేశమంతా చూస్తోందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా వారు చూస్తున్నారని, అందుకే మీరు వణికిపోతున్నట్లున్నారంటూ బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. పైకి శత్రువుల్లాగా నటిస్తూ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ఇన్నిరోజులు విస్మరించిన సర్కార్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆయన అన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదు.

Also Read : Criminal Laws: ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు.. దేశద్రోహ చట్టం రద్దు

రైతులు, యువత, 317 జీవో ద్వారా టీచర్లు ఇబ్బందులు పడినా ఏనాడూ ఈ సర్కార్ పట్టించకున్న పాపాన పోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఎందుకివ్వలేకపోతున్నారు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. మిషన్ భగీరథ నిధులు దుర్వినియోగం చేశారని, మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దొంగిలించారని, పేదలకు మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం కోసం డబ్బులు ఎలా వసూలు చేశారు? అని బండి సంజయ్‌ అన్నారు. మన్రేగా కార్మికులకు కేటాయించిన నిధులను ఎలా దారిమళ్లించారు? కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు మీరు ఎందుకు సహకరించడంలేదని ఆయన మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై ఇంకెన్ని అబద్ధాలు చెబుతారని, మోడీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్ మీ కారును తుక్కు తుక్కుగా చేస్తుందన్నారు బండి సంజయ్‌.

Also Read : Snoring Remedies : గురక సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించండి!

Exit mobile version