Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడికి పోయింది

Bandi Sanjay

Bandi Sanjay

కేసీఆర్ కి ప్రజల ఓట్ల పై నమ్మకం లేదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. జనవశీకరణపై నమ్మకం ఉందని, వశీకరణ, తాంత్రిక పూజలు చేస్తారు.. అందుకే ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కి వెళ్లడం లేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ అందరి క్షేమం కోసం చేసే పూజలు మాత్రమే ఫలిస్తాయన్నారు. మేడిగడ్డ మర్చిపోక మునుపే అన్నారం బ్యారేజ్ లీక్ మొదలైందని, బ్యారేజ్ లీకేజీల గురించి కేసీఆర్ మాట్లాడాలన్నారు. కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడికి పోయిందని, కాళేశ్వరంతో ఎవరికి న్యాయం జరగలేదన్నారు బండి సంజయ్.

Also Read : Seema Haider: ఉపవాస దీక్ష కోసం ఎల్లలు దాటిన ప్రేమ.. సచిన్ కోసం వచ్చిన సీమా

అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ పార్టీ,రాష్ట్ర నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ప్రొజెక్టర్ పెట్టి కాళేశ్వరం లీకేజీల గురించి కేసిఆర్ చెప్పాలి. కాంట్రాక్టులు కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు పై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. తాంత్రిక పూజసమగ్రి కాళేశ్వరంలో కలపడనికే కేసీఆర్ వెళ్ళాడు. నాణ్యత లోపం కారణంగానే లీకేజీ సమస్యలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ తప్పిదం. కేసీఆర్ క్షమాపణ చెప్పి రైతులను ఓట్లు అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డామ్ లు కుంగుతున్నాయి..లికవుతున్నాయి. లక్ష ముప్పై కోట్ల కేసీఆర్ కుటుంబం నుంచి రికవరీ చేయాలి. విద్రోహ చర్య అయితే పోలీసులు ఏం చేస్తున్నారు. ఎన్నికలున్నాయి కాబట్టి విద్రోహ చర్య అంటే ప్రజలు మర్చిపోతారు అనులకుంటున్నారు.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Spicy Foods : కారం ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీ ప్రాణాలు డేంజర్లో ఉన్నట్లే..

Exit mobile version