కరీంనగర్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని ధర్మం కోసం దేశం కోసం పనిచేసే బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని అన్నారు. కరీంనగర్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే భూ కబ్జాలు భూమాఫియా ఆస్తులు సంపాదించుకోవడానికి పనిచేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు బండి సంజయ్.
Also Read : Top Headlines @1PM : టాప్ న్యూస్
బీజేపీని రాష్ట్రంలో గెలిపిస్తే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తూ యువత ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని ఆయన అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ 50 లక్షలు యువత కు ఉద్యోగాలు కల్పించారన్నారు బండి సంజయ్. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు నిండుగా ఉంటాయన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాపై బీఆర్ఎస్ ప్రభుత్వం 74 కేసులు పెట్టిందన్నారు. అయినా భయపడే ప్రసక్తే లేదు జైలు బెల్లు కొత్తవి కాదన్నారు. కరీంనగర్ యువత కాషాయ జెండా చేతపట్టుకుని భారతమాతాకీ జై అంటూ స్వచ్ఛందంగా తరలివస్తున్నందుకు సంతోషంగా ఉంది. కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి ఎంపీగా నేనేం చేశానో అన్ని వివరాలు పుస్తకాల రూపంలో, కరపత్రం రూపంలో ఇంటింటికీ వస్తాయి. ఇకపై మీరంతా ఎంపీగా నేను చేసిన అభివ్రుద్ధి పనులను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కోరుతున్నా.
Also Read : Check Your Name: సెల్ ఫోన్ నంబర్‌తో ఓటర్ల జాబితా.. మీ పేరు ఉందో? లేదో? చెక్ చేయండి?