Site icon NTV Telugu

Bandi Sanjay : తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు… ప్రజలు అనుకోవాలి

Bandi Sanjay

Bandi Sanjay

ఉప ఎన్నికల్లో గెలిచింది బీజేపీ, కాంగ్రెస్ కాదని ఆయన అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు… ప్రజలు అనుకోవాలని, ఎన్నికల్లో డిపాజిట్‌లు ఎవరివి పోతున్నాయో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అద్దాల మెడలో ఉంది… సంతోష పడుతుందని, అవినీతి, కుటుంబ పాలనపై డేగ కళ్ళతో కేంద్రం చూస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కోమటి రెడ్డి, జానా రెడ్డి చెప్పారన్నారు.

Also Read : Madras High Court: భర్త లేదా భార్య ఎవరి పేరు మీదున్న.. ఆస్తిపై ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది: హైకోర్టు

బీజేపీ గెలువొద్దని కేసీఆర్‌ భావిస్తున్నారని, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు ఎలాగూ తన పార్టీ లోకి వస్తారనీ కేసీఆర్‌ అనుకుంటున్నాడన్నారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్‌ పెంచి పోషిస్తున్నాడని, పాకెట్ మనీ ఇస్తున్నాడన్నారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గమనిస్తోందని బండి సంజయ్‌ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవొద్దని కేసీఆర్ గట్టిగా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లు ఎలాగూ బీఆర్‌ఎస్‌లో వస్తారని భావిస్తున్నారని, అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌ను పైకి లేపుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉన్న చోట 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు రూ.వేల కోట్లు పాకెట్‌ మనీ ఇచ్చి కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

Also Read : Madras High Court: భర్త లేదా భార్య ఎవరి పేరు మీదున్న.. ఆస్తిపై ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది: హైకోర్టు

Exit mobile version