ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు జగిత్యాలలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్.. జగిత్యాల బస్ స్టాండ్ చౌరస్తాలో బిజెపి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏం జోష్ ఉన్నదే మీలో… వట్టి గడ్డ నా ఇది… నా జితేందర్, రామన్న, గోపన్న ల గడ్డ ఇది అంటూ జగిత్యాల వాసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా… కాషాయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తులు పుట్టిన గడ్డ ఇది అని, మనమంతా జితేందర్, రామన్న, గోపన్న ల వారసులమన్నారు.
జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో… విద్యార్థులతో కుర్చీలు వేయించారని, ఇంకా వారితో ఎన్నో పనులు చేయించారని ఆయన ఆరోపించారు. దేశంలో చైనా బజార్లు అని అంటున్న కేసీఆర్ కు సిగ్గుండాలని, చైనా బజార్లను భారత్ బజార్లుగా మార్చిన ఘనత మోడీదన్నారు. మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలను మైసూర్ లో తయారు చేస్తారా? ఇరానీ చాయ్ అంటే.. ఇరాన్ లో చేస్తారా? ఆ మాత్రం తెలివి లేదా కేసీఆర్.. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వేములవాడ ఆలయాన్ని ‘ప్రసాదం స్కీం’ కింద అభివృద్ధి చేద్దామంటే… కేసీఆర్ సహకరించడం లేదని, వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అన్న కేసీఆర్…. నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
Also Read : Ramakrishna Math: బుక్ లవర్స్‌కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్
బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్లు అన్న కేసీఆర్…ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అంటున్నడు. కొండగట్టు ప్రమాదంలో అంతమంది పేదోళ్లు చనిపోతే… ఒక్కసారైనా కేసీఆర్ వచ్చి, సంతాపం ప్రకటించాడా..? ఆ బాధిత కుటుంబాలను ఆదుకున్నాడా…? కనీసం ఆ కుటుంబాలను పరామర్శించాడా? అని ఆయన ప్రశ్నించారు. కొండగట్టులో కేసీఆర్ బిడ్డ కవిత ఏదైనా జాగా కొని ఉండవచ్చు. అందుకే ఇప్పుడు 100 కోట్ల రూపాయలని అంటున్నడు. కేసీఆర్ కు కింద పెట్టిన మీటర్ దెబ్బకే… బిడ్డ బాగోతం బయటపడింది.
కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేసింది. కేసీఆర్ కూతురు బతుకమ్మ పేరు మీద డిస్కో డాన్సులు చేసింది. బతుకమ్మ పేరుతో మన సంప్రదాయాన్ని, బతుకమ్మను కించపరిచింది. బతుకమ్మ తల్లిని కించపరిచిన కేసీఆర్ బిడ్డ ఉత్తగనే పోతదా? లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డను అరెస్టు చేస్తే… జగిత్యాల చౌరస్తాలో ప్రజలు ధర్నా చేయాలా?. కేసీఆర్ బిడ్డను అరెస్టు చేయాలా..? వద్దా?. దొంగ దందా చేసిన కవిత సింహం, పులి బిడ్డా…?.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వాళ్లపై.. సీబీఐ, ఈడి విచారణ జరపాల్సిందే.. నరేంద్ర మోడీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు.. రైతుల మోటార్లకు కేసీఆర్ మీటర్ పెడితే… బయటికి గుంజుతాం.
ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేస్తా అన్నాడు. చేశాడా? ఇక్కడ ‘మాతా శిశు కేంద్రం’లో అనేకమంది చనిపోయారు. ఒక్క నెలలో ఆరుగురు బాలింతలు చనిపోయారు.
జగిత్యాలలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఇచ్చాడో కేసీఆర్ సమాధానం చెప్పాలి. బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేశాడు. ఈ ప్రాంత మున్సిపాలిటీకి కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులు ఇచ్చాడో సమాధానం చెప్పాలి. ‘ అని బండి సంజయ్ అన్నారు.