తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు బండి సంజయ్ నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన అన్నారు. కేసీఆర్‌పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు.. అయినా డోన్ట్ కేర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒవైసీకి సవాల్ చేసి పాతబస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటినమని, 12 శాతం ఓట్లకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారన్నారు బండి సంజయ్. కేసీఆర్… అయోధ్యలో రాముడు జన్మించారా? లేదా? చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. పొరపాటున కేసీఆర్ కు అవకాశమిస్తే… రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటాడు? అని బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్ పటాన్ చెరువు నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ ను తీసుకొస్తామని, లింగాయత్, ఆరె మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ పూర్తి కావొచ్చిందన్నారు.
Also Read : Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. భవన యాజమాని అరెస్ట్
ఇదిలా ఉంటే.. అంతకు ముందు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌కి బండి సంజయ్ ఛాలెంజ్ విసిరారు. ఇవాళ కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. తన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో గంగుల రావాలని.. అలా చేస్తే తనకున్న ఆస్తులన్నీ ప్రజలకు పంచుతానని తెలిపారు. తనలాగే గంగుల ఆస్తుల్ని పంచే ధైర్యం గంగులకు ఉందా అని సవాల్ విసిరారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఇప్పటివరకు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వని వ్యక్తి మళ్లీ గెలిపిస్తే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రజల కోసం కొట్లాడానని, తనపై 74 కేసులు ఉన్నట్లు తెలిపారు. కుటుంబానికి దూరమై ప్రజల కోసం కొట్లాడుతున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గంగులను చిత్తుగా ఓడిస్తానని స్పష్టం చేశారు. గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Also Read : Current Bill : ఈ చిన్న అలవాట్లను మార్చుకుంటే చాలు.. కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది..