Site icon NTV Telugu

Bandi Sanjay : హిందుత్వం లేకుండా భారతదేశం లేదు

Bandi Sanjay

Bandi Sanjay

హనుమాన్ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్‌లో బీజేపీ హిందూ ఏక్తా యాత్రను నిర్వహించింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు వస్తున్నాయన్నారు. కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారు కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించమా అని ఆయన వ్యాఖ్యానించారు. పదిహేను నిమిషాల్లో నరికి చంపుతా అన్నోళ్లను ఒక్క 5 నెలల్లో రోడ్ల మీద ఉరికిస్తమని బండి సంజయ్‌ అన్నారు. హిందుత్వ లేకుండా భారత దేశం లేదని, 80 శాతం హిందువులు ఉంటే పాకిస్తాన్ విడిపోయింది.. హిందుత్వ లేకుంటే ఈ దేశం పాకిస్తాన్ అయ్యేదన్నారు బండి సంజయ్‌.

Also Read : KKR vs CSK: చెమటోడుస్తున్న కేకేఆర్.. తొలి 10 ఓవర్లలో పరిస్థితి ఇది!

అంతేకాకుండా.. ‘ఎంఐఈఎం పార్టీ మెడికల్ కాలేజీలో హెచ్‌వోడీగా ఒక ఉగ్రవాదిని నియమించారు. మతోన్మాద శక్తులకు తీవ్ర వాదులతో అంటకాగుతున్న వారితో కుహనా లౌకిక వాదులు చెత్తపట్టలు వేసుకుని తిరుగుతున్నారు. సచివాలయంలో నల్ల పోచమ్మ గుడికి రెండున్నర గుంటల జాగా మాత్రమే ఇస్తారా మాకు ఇవ్వండి.. మేము స్వర్ణ దేవాలయం చేస్తాం. ఇస్తాంబుల్ లో పుట్టినోడికి ఇక్కడ రాచ మర్యాదలతో అంత్యక్రియలు చేస్తారా? తెలంగాణలో హిందువులు ఏకం కావాలి.. జాగృతం కావాలి… జగిత్యాలలో ఒక మాములు ఎస్సై భార్య ను బురఖా వేసుకున్న మహిళ తీరు చూసారు… కేసు పెట్టి ఎస్సైని సస్పెండ్ చేశారు.. ఈ బురఖా మహిళల కోసం ట్రిపుల్ తలక్ రద్దు చేసినప్పుడు ఎంఐఎం పార్టీ ఎక్కడ పోయింది. తెలంగాణలో బకాసురులు, రాక్షసులు, రజాకార్ల పాలన గద్దె దింపుతాం.’ అని ఆయన అన్నారు.

Also Read : Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్‌లో టెన్షన్

Exit mobile version