తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు.. కేసీఆర్ కు కూడా ప్రమేయం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పదే పదే ఢిల్లీ వెళ్తున్నాడని, పంజాబ్ లో కూడా లిక్కర్ సిండికేట్ లో సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అయితే.. దీని పై సీఎం స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాత్రంతా ఈ.డీ-ఈ.డీ అని కలవరించి రగ్గులు కప్పుకుని పడుకుంటున్నాడంటూ విమర్శించారు. ఢిల్లీలో ఒబేరాయ్ హొటల్ లో లిక్కర్ సిండికేట్స్ తో కలిశారా లేదా.. రాంచంద్ర పిల్లే, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్ అనే లిక్కర్ వ్యాపారులతో మీకు సంబంధాలు ఉన్నాయా లేవా..? ట్విట్టర్ టిల్లు ఏడ పన్నాడో స్పందించాలి.. సీఎం కు మద్యం అంటే చాలా ప్రేమ.. మునుగోడులో సీఎం సభ ప్లాప్ అయింది.. బీజేపీ సభకు హాజరైన జనాన్ని చూస్తే మునుగోడు ప్రజలంతా బీజేపీ వెంట ఉన్నారు.
ఈనెల 27న హనుమకొండ జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరు అవుతారు.. లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు పక్కా దోషులుగా తెలుతారు.? లిక్కర్ దందాతో సంబంధం లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించాలి. ఫాల్త్ నా కొడుకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అమీత్ షా పెద్ద మనిషి, ఆదర్శ నాయకుడు.. నాకు గురువులాంటి వారు. చెప్పులు తీసి ఇస్తే తప్పేంటి. కేసీఆర్ బిడ్డ కాళ్ళు కానిస్టేబుల్ మొక్కాడు గులామ్ గిరి చేసినట్లా.. అమిత్ షా ను టచ్ చేయడం కోసం చాలామంది తహతహలాడుతుంటారు.. లిక్కర్ ఇష్యూను తప్పుదారి పట్టించడం కోసమే ఇదంతా.. కేసీఆర్ కాంగ్రెస్ నేతల కాళ్ళు మొక్కలేదా… లక్ష్మీపార్వతి కాళ్లు కూడా మొక్కిన చరిత్ర కేసీఆర్‌ది.. కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు తిరిగేది బీజేపీయేతర ప్రభుత్వాలను ఏకం చేయడం కాదు.. ఇతర రాష్ట్రాలకి వెళ్లి లిక్కర్ సిండికేట్ చేస్తున్నాడు.. ఇందులో కాంగ్రెస్ నేతలకు కూడా సంబంధాలు ఉన్నాయి. సృజన్ ఎవరి బంధువు తెలాలి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు కలిసే వాటాలు పంచుకున్నారు. సీఎం సమాధానం చెప్పాలి. అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
