Site icon NTV Telugu

Bandi Sanjay: కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై.. కౌంటర్ దాఖలు చేసిన బండి సంజయ్

Bandi

Bandi

కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై కౌంటర్ దాఖలు చేశారు బండి సంజయ్. బండి సంజయ్ కుమార్ కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలు.. తాను చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఫోన్‌లు ట్యాప్ చేయబడ్డాయని నిందితులు ఒప్పుకున్నారని అఫిడవిట్‌లో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర గురించి తనకు తెలియదని బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్ తెలంగాణను అత్యంత సంపన్న రాష్ట్రంగా మార్చారన్న పిటిషనర్ వాదనను ఆయన తోసిపుచ్చారు.

Also Read:Cholera-Tenali: తెనాలిలో కలరా కలకలం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు..!

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అవకతవకలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. 2014 నుండి 2023 నవంబర్ వరకు రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, అలాగే పెండింగ్‌ బిల్లులు కూడా పెరిగాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కోర్టు ఇంజంక్షన్ మంజూరు చేస్తే, అది వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు తన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని ఆయన వాదించారు.

Also Read:Sree Vishnu: అక్టోబర్ 2న శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి ఆదేశించారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ కోరిన రూ. 10 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నిందితుల వాంగ్మూలం, ప్రభుత్వ పబ్లిక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉన్నందున క్షమాపణలు చెప్పడానికి కూడా నిరాకరించారు.

Exit mobile version