నేడు బీజేపీ ఓబీసీ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ లో లక్ష మందితో బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు. భజరంగ్ దళ్ ను కేసీఆర్ నిషేదించాలని చూస్తున్నాడని, హిందువులంతా ఏకం కావాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతుంది భజరంగ్ దళ్ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మత విద్వేషాలను భజరంగ్ దళ్ రెచ్చగొట్టలేదని, కేసీఆర్ ఎట్లా నిషేధిస్తాడో చూస్తామని ఆయన అన్నారు. ఇవ్వాళ జరిగే కేబినెట్‌లో భజరంగ్ దళ్ ను నిషేదించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్నారు.
Also Read : PKSDT: ‘బ్రో’.. దేవుడు టైమ్ స్టార్ అయ్యిందిరోయ్
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జూన్ లో లక్ష మందితో బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు. బీసీ బంధు ప్రకటించటానికి ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేసీఆర్ క్యాబినెట్‌లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులున్నారని, కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్టకొట్టిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండదని, దళితబంధులో 30శాతం కమిషన్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారన్నారు. 30శాతం కమిషన్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కేసీఆర్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Also Read : Karnataka Politics: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్యే ఎందుకు..? డీకే ఎలా పట్టు నిలుపుకోనున్నారు..?
