పదో తరగతి పరీక్ష పత్రాలు లేకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయని, బండి సంజయ్ కాల్ డేటా పూర్తిగా తీసుకోవాల్సి ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. కొంతమంది నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. నిజాలను రాబట్టడానికి సాక్ష్యులను విచారించాల్సి ఉందని, బండి సంజయ్ కు బెయిల్ ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Margani Bharat: పవన్ 2 రోజులు కనబడితే 3 రోజులు కనిపించరు.. ఢిల్లీకి పిలిచారా? ఆయనే వెళ్లారా..?
బండి సంజయ్ బెయిల్ రద్దుకు ప్రాసిక్యూషన్ వాదనలు.. బండి సంజయ్ కు బెయిల్ ఇస్తే మళ్లీ మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. 10వ తరగతి విద్యార్థుల పేరెంట్స్ బండి సంజయ్‌పై దాడి చేసే అవకాశం ఉందని, పరారీలో ఉన్న నిందితులను ప్రభావం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. టెక్నికల్ డేటా ఇంకా రికవరీ చేస్తున్నామని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయొచ్చని పోలీసుల కస్టడీ పిటిషన్‌లో విన్నవించారు.
Also Read : MP Uttam Kumar Reddy : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ ఉత్తమ్
