Bandi Sanjay : ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి
- రైతు భరోసా డబ్బులు వేయండి
- ఇది కొనసాగుతున్న పథకమే
- ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి
- ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితం
- రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. పైగా జరిగే ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందును ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవన్నారు. అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపిందుకు కూడా సిద్ధమన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఈరోజు (శుక్రవారం) ప్రకటన విడుదల చేశారు.
తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులను వెంటనే ఎంపిక చేసి మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసేందుకు అనుమతి తీసుకుందామని కోరారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా పైసలు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో చేతికందే సొమ్మును కూడా ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వీరిలో 40 వేల మందికి మాత్రమే మంజూరు చేసి మిగిలిన 99 శాతం మంది పేదల కడుపు కొట్టడం అమానవీయమన్నారు.
అట్లాగే వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీల కుటుంబాల బ్యాంకుల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 20 వేల 336 మంది ఖాతాల్లోనే డబ్బులు జమ చేసి, మిగిలిన 9 లక్షల 79 వేల మందికిపైగా కూలీలకు జమ చేయకపోవడం అన్యాయమన్నారు.
అట్లాగే రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల కోసం అందిన 70 లక్షలకు పైగా దరఖాస్తుల్లో … దాదాపు 40 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులని తేలితే ఇప్పటి వరకు 72 వేల 406 మందికి మాత్రమే ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి, మిగిలిన వారిని ఎంపిక చేయకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ప్రతి ఒక్క లబ్దిదారుడికి రైతు భరోసా సొమ్ము వేయడంతోపాటు మిగిలిన 3 పథకాలకు సంబంధించి లబ్ది చేకూర్చే ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
CPM AP Conference: నెల్లూరులో రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు..
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!