Site icon NTV Telugu

Bandi Sanjay: రెండు నెలల్లో ముఖ్యమంత్రి ఇంటికి పోతాడు

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ లో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పాపన్న విగ్రహానికి ఎంపీ బీజేపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ మద్యం టెండర్ల ద్వారా ఆదాయం సంపాదిస్తుంది అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కాస్లీ పార్టీలు.. మరో రెండు నెలల్లో ముఖ్యమంత్రి ఇంటికి పోతాడు అని ఆయన తెలిపాడు.

Read Also: Drones: డ్రోన్ల ద్వారా ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ.. కేంద్రం కీలక నిర్ణయం

ఎన్నికలకు ఇంకా రెండు నెలలు టైమ్ ఉన్న ముందే మద్యం టెండర్లు పెట్టాడు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. నవంబర్ వరకు టెండర్లకు సమయం ఉంది.. కానీ, ముందే 2000 కోట్ల రూపాయలు సంపాదించాలి అని సీఎం కేసీఆర్ టార్గెట్ పెట్టుకున్నాడు.. సంవత్సరానికి 50 వేల కోట్లు సంపాదించాలని ముఖ్యమంత్రి అనుకున్నాడు అని బండి సంజయ్ అన్నారు.

Read Also: Commando Suicide: ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య.. కారణమేంటంటే?

కాంగ్రెస్ పార్టీ కి పోటీ చేసే అభ్యర్థులే లేరు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ముందు పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాలేదు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క దరఖాస్తుకు 50 వేల రూపాయలు అని చెప్పడం ఏంటి?.. డబ్బులు లేని వారు ఎవరు పోటీ చెయ్యొద్దని కాంగ్రెస్ అనుకుంటుంది.. డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్స్.. మంచి చేసే వారికి టికెట్ లేదు.. డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు.. తెలంగాణలో దరఖాస్తుల టైమ్ నడుస్తుంది అని బండి సంజయ్ విమర్శించారు.

Exit mobile version