Site icon NTV Telugu

Bandi Sanjay: మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీపై సెటైర్

Bandi Sanjay

Bandi Sanjay

ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు. ట్విట్టర్ ( ఎక్స్ )లో పోస్ట్ లో ఉన్న కామెంట్స్.. ఇవే, 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నాడు. ఒకే ఓటు – రెండు రాష్ట్రాలు అనే పిలుపునిచ్చిన తొలి అటల్ బిహారీ వాజ్‌పేయి.. మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది అని ఆయన అన్నారు.

Read Also: Rajinikanth: జైలర్ లాంటి హిట్ ఇస్తే.. డైరెక్టర్ ను అవమానించడం భావ్యమా తలైవా..?

వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీరు.. మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. జవహర్‌లాల్ నెహ్రూ – జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేశారు.. ఇందిరా గాంధీ – కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా 1969లో దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారు.. 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో రాజీవ్ గాంధీ హామీ ఇచ్చారు.. ఇక, సోనియా గాంధీ – 2009 తెలంగాణా ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారు.. దీంతో 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని తెలిసి ఆ బిల్లును ప్రవేశపెట్టారు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

Read Also: AP High Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ.. ముకుల్‌ రోహత్గీ కీలక వాదనలు

Exit mobile version