తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ట్విట్టర్ వేదికగా.. ట్విట్టస్త్రాలు సంధించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీని మంత్రి కేటీఆర్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తే.. దానికి కౌంటర్‌గా బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉద్యమకారులకు కేసీఆర్ పార్టీలో చోటివ్వలేదని, దళితులకు మూడెకరాలు ఇవ్వలేదని, దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చేయలేందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. అంతేకాకుండా.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, దళితబంధు అర్హులకు ఇవ్వలేదని, పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వలేదని, ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వలేదని బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు, నిన్ను ఎందుకు భరించాలి ? సహించాలి ? అని ఆయన అన్నారు. అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు.? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా
ఇదిలా ఉంటే.. అంతకు ముందు మంత్రి కేటీఆర్.. ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని మోదీ చెప్పారని, తెలంగాణ కు ఏదీ ఇచ్చేది లేదని మోదీ సర్కార్ చెప్పిందని వివరించారు. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.?? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.
Also Read : Electricity Demand : మరోసారి రికార్డు సృష్టించిన విద్యుత్ వినియోగం
