Site icon NTV Telugu

80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేస్తే తప్పా ? : బండి సంజయ్

80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు.

కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి వరద బీభత్సంలో దెబ్బతిన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ధ్రుఢ సంకల్పంతో పున: ప్రతిష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి పవిత్ర కార్యం జరిగేదా? అని తెలిపారు. దీన్ని కూడా మతతత్వ కోణంలో చూస్తే ఇంత కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదన్నారు. కుహానా లౌకిక శక్తుల ఆలోచనల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్‌.

Exit mobile version