బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందిస్తూ.. ఇక బీఆర్ఎస్ పార్టీ గెలవదన్నారు. భూ కబ్జా చేసిన వారికి, పేదల ఉసురు తీసుకున్న అవినీతి పరులకు టికెట్ ఇచ్చారని, తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ బిడ్డ శూర్పణఖ కు అడ్డా.. గజ్వేల్ ఓడిపోతననే కామారెడ్డి కి పోయాడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Also Read : BRS Left Parties: బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుకు బ్రేక్..?
అక్కడ ఎంఐఎం ఉందని వెళ్ళాడని, రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్ రాని వాళ్లు మన వైపు వస్తారని, కేసీఆర్ ఏదో చేద్దామని ఏదో చేశాడంటూ ఆయన సెటైర్లు వేశారు. తన చేతితోనే తన పార్టీ కి మంట పెట్టుకున్నాడని, కేసీఆర్ కొత్త బిచ్చగాడిగా మళ్ళీ వచ్చి మోసం చేస్తాడని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలకు ఉపయోగ పడే ఏ స్కీమ్ ను బీజేపీ తీసివేయదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎగేరీగిరి పడుతుంది… ఆ పార్టీ ఎక్కడ లేదని ఆయన అన్నారు.
Also Read : Raviteja : విమానం లో ప్రత్యక్షమైన రవితేజ.. ఎక్కిడికి వెళ్తున్నాడంటే..?