NTV Telugu Site icon

Bandi Sanjay : బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి

Bandi Sanjay Telangana Congress

Bandi Sanjay Telangana Congress

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బిజెపికి ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచిన ఉప ఎన్నికలు గ్యారంటీ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ సుస్థిర పాలన ఏర్పాటు చేసే వరకు ఆగదన్నారు. ప్రజల గుండెల్లో బిజెపి పువ్వు వికసించి ఉందన్నారు బండి సంజయ్‌ అన్నారు. కేటీఆర్ షాడో సీఎం.. ఆయనకింద ప్రతి మండలానికి ముగ్గురు సామంత రాజులు ఉన్నారన్నారు. పోలీసులకు మేము వ్యతిరేకం కాదు.. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండన్నారు బండి సంజయ్‌.

అంతేకాకుండా.. ‘బతుకమ్మ చీరలతో పదిమందిని బడా బాబులం చేశాడు. వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా కార్మికులను చేస్తానని మరిచారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల నిరుద్యోగుల కోసం నేను కొట్లాడా.. టెన్త్ పేపర్ బికెజి పేరిట జైలుకు పంపారు. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వచ్చిన.. పెన్షన్ దారులకు ఒకటో తేదీన పెన్షన్ వచ్చిన బిఆర్ఎస్ కు ఓటెయ్యండి. ఉద్యోగులకు జీతాలు రావాలంటే బండి సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. కేటీఆర్ ను సీఎం చేస్తానని ప్రకటిస్తే పార్టీలో పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. సిరిసిల్లలో ఎంతమంది చేనేత కార్మికులు, రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నావో శ్వేత పత్రం విడుదల చేయాలి. బీసీలకు గుణం లేదని ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటే ఓర్వలేక పోతున్నారు. సిరిసిల్లలో సైలెంట్ గా ఓటింగ్ జరుగుతుంది.. రాణి రుద్రమ ఎమ్మెల్యేగా కాబోతోంది.’ అని బండి సంజయ్‌ అన్నారు.