Site icon NTV Telugu

Bandi Sanjay : పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రు

Bandi Sanjay Cm Kcr

Bandi Sanjay Cm Kcr

పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్– బీజేపీ ఘర్షణనలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సోమవారం బండి సంజయ్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. గూండాలకు గన్ లైసెన్సు ఇస్తారా? అని నిలదీశారు బండి సంజయ్‌. ఈటల కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలైతే తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు బండి సంజయ్‌. పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని, పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈనెల 5న బీఆర్ఎస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు బండి సంజయ్‌. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ఇప్పటికీ ఈప్రాంతంలో ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు బండి సంజయ్‌.

Also Read : MLC Jeevan Reddy : రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

ఇదిలా ఉంటే… ‘మేము తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెడతాం. మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా.. రాయలేదా? అంటే ముఖ్యమంత్రిని కాదని కేంద్ర ప్రభుత్వం వచ్చి మీటర్లు పెడతారా. 50 శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వానిది 49 శాతం షేర్ కేంద్ర ప్రభుత్వానిది. ఎక్కువ షేర్ ఉన్నవారు ప్రైవేటీకరణ చేస్తారా, లేక తక్కువ ఉన్నవారు చేస్తారా. వాళ్లు ఇచ్చిన అభివృద్ధి మీద చర్చకు వారు సిద్ధంగా లేరు. 24 గంటలు మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే’. అని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Also Read : Harish Rao : నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో మరో 1,400 పోస్టుల భర్తీ

Exit mobile version