రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జలవిహార్ లో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. మూవీ ని యాట సత్యనారాయణ డైరెక్ట్ చేయగా… సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్న సమయంలో పాతబస్తీ ఫైల్స్ తీద్దామని చెప్పి.. ఫస్ట్ రజాకర్ ల ఫైల్స్ తీద్దామని గూడూరు నారాయణ రెడ్డి అన్న చెప్పిండు.
Also Read : Akshara Gowda: బ్లాక్ డ్రెస్ లో బెంబేలేత్తిస్తున్న బ్యూటీ
చెప్పింది చేసి చూపించిండు… అన్నకి గుండె దైర్యం ఎక్కువే.. నిజమైన చరిత్రని చూపించాలన్న భయపడే పరిస్థితి వచ్చింది.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎవడికి తెలంగాణ చరిత్ర తెలీదు. ఇప్పుడున్న ఆ పార్టీ అప్పుడు పుట్టలేదు కూడ. తెలంగాణ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి విద్యాసాగర్ రావు ఒక్కడే. తెలంగాణ కి స్వతంత్రం తేడానికి ఎంతో ఫైట్ చేసిండు. మాలాంటి కార్యకర్తలకి ఆయన స్ఫూర్తి.
Also Read : చమ్కీల చీరలో తలకున్న మెరుస్తున్న శ్రీముఖి
గతంలో జరిగిన ఉద్యమ స్పూర్థిగానే ఇప్పటి తెలంగాణ ఉద్యమం ఒచ్చింది. కానీ వీళ్ళు ఇంకా వక్రీకరిస్తూనే ఉన్నారు. మీడియా సపోర్ట్ చేసిన చేయకున్నా… తెలంగాణలోని ప్రతి ఒక్క యువకుడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చెయ్యాలి. చేస్తారు కూడా. ఈ సినిమాలో దైర్యం చేసి నటించారు కాబట్టి… మీరు రియల్ హీరోలు. ఈ సినిమాకి, నారాయణ అన్నకి తమ్ముడిగా ఎప్పుడు అండగా ఉంటాను.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
