నల్లగొండ జిల్లా మునుగోడులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమ గుర్తును పోలిన గుర్తులను అభ్యర్థులకు కేటాయించవద్దని హైకోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై బండి సంజయ్ మాట్లాడుతూ.. న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, మునుగోడు ఉప ఎన్నికల్లో ఒడిపోతామన్న భయంతో ఎదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే ఇండిపెండెంట్‌ల 8 గుర్తుల రద్దు చేయాలని టీఆర్‌ఎస్ కోర్టును ఆశ్రయించిందని ఆయన మండిపడ్డారు.
Also Read : Worst Day of the Week : వారంలో చెత్త రోజుగా సోమవారం.. గిన్నిస్ రికార్డ్
టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలుస్తుందని, మునుగొడులో బీజేపీ గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందని, ఈ గుర్తులు టీఆర్‌ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నుంచి ఉన్నాయన్నారు. ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందో చెప్పాలన్నారు. ఇండిపెండెంట్ల కు సంబంధించిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్ ను గౌరవ న్యాయస్థానం కొట్టేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేవలం ఎన్నికలను ఆపాలన్న దురుద్దేశంతోనే టీఆర్‌ఎస్ రిట్ పిటిషన్ వేసిందన్నారు బండి సంజయ్. కానీ న్యాయస్థానం ముందు టీఆర్‌ఎస్ కుతంత్రాలు పనిచేయలేదని ఆయన అన్నారు.