Site icon NTV Telugu

Bandi Sanjay : కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ముందుగానే పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ చేసుకుంటున్నాయి

Bandi Sanjay

Bandi Sanjay

మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమం సందర్భంగా సనత్ నగర్ లో ఓ స్కూల్ లో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడంలో పడే ఇబ్బందులను తొలగించేందుకు పరీక్ష పే చర్చ కార్యక్రమమని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 600 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ ప్రధాని అయినా, ఇతర పార్టీల నేతలు ఎవరైనా పిల్లల గురించి ఏనాడైనా కనీసం ఆలోచించారా? అని ఆయన అన్నారు. మోడీ ఆలోచించి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన వెల్లడించారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ముందుగానే పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు.

Also Read : Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్

అందుకే ర్యాంకులు వస్తున్నాయని, అలాంటి నిర్బంధ చదువులు ఎందుకు? యాజమాన్యాలు విద్యార్థులకు బయటి ప్రపంచాన్ని చూడనివ్వకుండా చేస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే పరిస్థితి ఏర్పడాలన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో పోటీ పడటం కాదు.. ముందు వారితో వారు పోటీ పడటం అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు పక్క విద్యార్థులకు ర్యాంకులు వస్తున్నాయని ఒత్తిడి తీసుకురావద్దన్నారు బండి సంజయ్‌. మన చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలే తప్పితే.. ర్యాంకుల కోసం కాదు అనే నిజాన్ని తెలుసుకోవాలన్నారు.

Exit mobile version