NTV Telugu Site icon

Bandi Sanjay : మొన్న వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు

Bandi Sanjay Revanthreddy

Bandi Sanjay Revanthreddy

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఎకరానికి 10 వేల చొప్పున పరిహారం ఇస్తానని చిటికె వేసిండు ..ఇప్పటి వరకు పరిహారం రాలేదని, ఇప్పుడు పాత స్కీం లు అన్ని బంద్ ..ఇప్పుడు అన్నీ కొత్తపథకాలు మొదలు పెట్టిండంటూ ఆయన ధ్వజమెత్తారు. బ్రిటిష్ కాలంలో కట్టిన కాల్వ ప్రాజెక్టు ఇప్పటికి మూడు సార్లు దెబ్బ తిన్నదని, మరమ్మతు చేయాలన్న స్పృహలేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు.

Also Read : Anju Nasrullah Love Story: అంజు కేసులో కొత్త ట్విస్ట్.. అంజు, నస్రుల్లాపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు

రైతులు, మత్స్యకారులు దాదాపు 50 లక్షల నష్టం వాటిల్లిందని, మూడు నెలల ముందు మద్యం టెండర్లు వేస్తుండు.. పోయినసారి 50లక్షల కోట్లు వస్తే ఈసారి 70 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది..ఈ డబ్బంతా ఏం చేస్తున్నావన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఎంతవరకు నష్టం జరిగింది వివరాలే లేవని, ఇప్పుడు ఈ నష్టం గురించి మరిచిపోవాలని కొత్తగా అంశాన్ని తీసుకొచ్చిండన్నారు. ఆర్టీసీ విలీనం చేయాలనీ నాలుగేళ్లు నువ్వు ఆలోచిస్తే గవర్నర్ బిల్లు గురించి ఆలోచించ కూడదా అని, ఆఘ మేఘాల మీద గవర్నర్ స్టాంప్ వేసి పంపాలా అని ఆయన ప్రశ్నించారు. అర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆలోచన ఉందా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని, బిల్లు తో ఏదైన నష్టం జరిగితే రేపు గవర్నర్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. నేను ఆర్టీసి ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా ..ఇందులో కుట్ర ఏముందో గమనించాలన్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే యత్నం చేస్తున్నాడని, కార్మికులకు నష్టం కలగవద్దనే గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు.

Also Read : Honor Watch 4: అదిరిపోయే ఫీచర్స్ తో హానర్ స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?

Show comments