NTV Telugu Site icon

Bandi Sanjay : భాగ్యనగర్ ప్రజల ప్రాణాలు ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయి

Bandi Sanjay

Bandi Sanjay

5గురు ఉగ్రవాదులు హైదరబాద్ లో పట్టు బడ్డారని, ఐఎస్ఐఎస్ కన్నా ప్రమాద కరమైన సంస్థ HUT అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు హైదరాబాద్‌లో షెల్టర్ ఇవ్వడం బాధాకరమని, మజ్లిస్ పార్టీ ఉగ్రవాదులకు, రోహింగ్యాలకి అశ్రయమిస్తుందని మేము ఎప్పటి నుండో చెబుతున్నామన్నారు. ఇప్పుడు అది నిజం అయిందన్నారు బండి సంజయ్‌. అంతేకాకుండా..’ఉగ్రవాద నాయకుడు…. ఓవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీ లో HOD గా పని చేస్తున్నారు. ఓవైసీ గతం లో టెర్రరిస్ట్ లకు సపోర్ట్ చేస్తా, బెయిల్ ఇప్పిస్తా అని చెప్పారు… నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అన్నప్పుడు చాలా మంది మోరిగారు… అందులో ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారు…. ఓట్ల కోసమని ఆరోపించారు… ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇచ్చేది ఎంఐఎం… ఓట్ల కోసం ఎంఐఎం ను అప్పుడు కాంగ్రెస్ వాడుకుంది… ఇప్పుడు బీఆర్ఎస్‌ వాడుకుంటుంది. శాంతి భద్రతల విషయం లో ఈ పార్టీ లకి చిత్త శుద్ది లేదు…

Also Read : Pakistan: విధ్వంసానికి ఆర్ఎస్ఎస్, బీజేపీనే కారణమట.. పాకిస్తాన్ లో వింతవాదన..

రాజకీయాలు కావాలి వారికి… అనంత గిరి గుట్టల్లో శిక్షణ ఇస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుంది. పోలీస్ లను ఈ ప్రభుత్వము పని చేయనియడం లేదు. యువకులను ముస్లిం లుగా మార్చి ఉగ్రవాదం లోకి పంపిస్తున్నారు… హిందువులు ఉగ్రవాదులే అని చెప్పేందుకు కొత్త తరహా జిహాద్. అధికారం లోకి వస్తే కర్ణాటక లో పీఎఫ్‌ఐపై నిషేదం ఎత్తెస్తమని కాంగ్రెస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత సీఎం పైన ఉంది. భాగ్యనగర్ ప్రజల ప్రాణాలు ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయి. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి. పోలీస్ లకు స్వేచ్ఛ ఇవ్వాలి…. కొత్త సీఎస్‌ (సోమేష్ కుమార్) రాజ్యాంగేతర శక్తిగా మారుతాడు. బండారం అంత బయట పెడతాడు అని ఆయన్ను సంకలో పెట్టుకున్నారు ఏమో…

Also Read : Dhanush: కిల్లర్.. కిల్లర్.. కెప్టెన్ మిల్లర్.. వచ్చేశాడు

ఇప్పుడు ఉన్న సీఎస్‌ పని చేయడం లేదా పదవి విరమణ పొందిన ఇతర రాష్ట్రాల వారిని సలహా దారులుగా పెట్టుకుంటున్నాడు.. కేసీఆర్‌ హింసించే 8వ పులకేశి… కర్ణాటక లో తిరిగి బీజేపీ అధికారం లోకి వస్తుందని విశ్వాసం ఉంది… అక్కడ నేతలతో మాట్లాడినప్పుడు గెలుస్తామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ లకు బీజేపీ అండగా ఉంటుంది… వారు కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు… ఓఆర్‌ఆర్‌ టెండర్‌లపై సీబీఔ విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. సీఎం నేను అన్ననా అంటాడు… సీబీఐ విచారణ మేము స్వాగతిస్తున్నము. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు… మళ్ళీ పరీక్షలు రాయొచ్చు….’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.