Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్‌కు మానవ సంబంధాలు లేవు.. ఆయనకు మనీ సంబంధాలు కావాలి

Bandi

Bandi

‘‘బలగం’’ సినిమాను వీక్షించేందుకు దేవి 70MM (RTC X ROAD) థియేటర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కుట్ర తో నాపై కేసు పెట్టారు .. నిరాధారమైన ఆరోపణలు చేశారు.. మా ఇంట్లో నుంచి నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చారు.. నాపై కేసు ఏంటో చెప్పకుండా పోలీస్ స్టేషన్లు చెప్పారు ..నా లీగల్ నన్ను కలవకుండా చేశారననారు. కేసీఆర్‌కు మానవ సంబంధాలు లేవు.. ఆయనకు మనీ సంబంధాలు కావాలని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి అప్పుడు కూడా ఇబ్బంది పెట్టారని, మా అత్తమ్మ చనిపోతే దశ దిన కర్మకు హాజరు కాకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి బలగం సినిమా చూపెట్టాలని, నిరుద్యోగులు తల్లులు కడుపు కోతకు గురి చేస్తున్న మూర్ఖుడు ముఖ్యమంత్రి అని ఆయన ధ్వజమెత్తారు. బండి సంజయ్ బెయిల్ ఎందుకు రద్దు చేయాలని, నా ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందని ఆయన అన్నారు.

Also Read : Natty Kumar: ఆస్కార్ గ్రహీతలకు సన్మానం.. అతను లేకుండా సిగ్గుచేటు

కరీంనగర్ నుంచి సిద్దిపేట వచ్చే వరకు ఫోన్ ఉందని, కమిషనర్ రంగనాథ్ నిన్ను వదిలే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ సత్యం బాబు కేసు నాకు తెలుసు అని, రంగనాథ్ ఆస్తిపాస్తులు, ఆయన చేసే దందా నాకు తెలుసు అని ఆయన అన్నారు. నల్గొండలో, ఖమ్మంలో ఏమీ చేశావో అన్ని బయటకు తీస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘రంగనాథ్ నీవు పెట్టుకున్న పోలీస్ టోపీ మీద ప్రమాణం చేయు. బిచ్చము ఎత్తుకున్న కేసీఆర్ కు వేల కోట్లు ఎలా వచ్చాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కాగజ్ నగర్ పేపర్ మిల్లు తెరవమంటే ఎందుకు తేరుస్తలేవు. ఇక్కడ చేయలేక పోయిన కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్లి ఏం చేస్తారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది. కన్న తల్లి కి తిండి పెట్టలేని కేసీఆర్.. పినతల్లి కి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉంది. నా ఫోన్ కాల్ డేటా చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారు : బండి సంజయ్. BRS ఎమ్మేల్యేలు, మంత్రులు నాకు కాల్స్ చేసిన విషయం తెలిసి కేసీఆర్ కి నిద్రపట్టడం లేదు. సీపీ రంగనాథ్ ఫోన్ కాల్ లిస్ట్ బయటకు తీస్తే మొత్తం బండారం బయట పడుతుంది.’ అని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Rashid Khan: రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం

Exit mobile version