Site icon NTV Telugu

Jamuna : సీనియర్ నటి జమున మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం

Jamuna

Jamuna

సీనియర్ సినీ నటీమణి జమున మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. సీనియర్ సినీ నటీమణి మతి జమున మరణం చాలా బాధాకరమైన విషయమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. జమున చలన చిత్ర రంగంలో తెలుగు, హిందీ మరియు దక్షిణాది భాషల్లో అనేక సినిమాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారని, వారు భారతీయ సంస్కృతీ సాంప్రదాయానికి మరియు తెలుగుతనానికి మూర్తీభవించిన మహిళా సినీ నటి అని, వారిలో వినయము, మర్యాద, గౌరవం, సౌశీల్యం, స్నేహభావం, సంస్కారం మూర్తీభవించేవని, వారి జీవితం మచ్చలేనిదని, మహిళలకు ఆదర్శంగా నిలిచేవారని బండారు దత్తాత్రేయ కొనియాడారు.

Also Read : Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు

జమున ఎన్నో చలనచిత్రాల్లో నటించి, కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని, పార్లమెంట్ సభ్యురాలిగా పార్లమెంట్ లో ప్రజాసమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషిచేశారని, తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జమున ఢిల్లీ కి వచ్చి సినీ రంగం మరియు ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషిచేసేవారని, వారి మృతి సినీ లోకానికి మరియు తెలుగు ప్రజానీకానికి తీరని లోటు అని బండారు దత్తాత్రేయ వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.జమున మృతి పట్ల బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్టసమయాన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Also Read : Today (27-01-23) Business Headlines: దేశంలో 99 శాతం ఇళ్లకు బ్యాంకింగ్ సేవలు. మరిన్ని వార్తలు.

Exit mobile version