MLA Katasani Rami Reddy: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కౌంటర్ ఎటాక్‌కు దిగారు. చంద్రబాబు ఏం చేస్తాడో చెప్పకుండా, డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారని కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.. ఏదో పేపర్ ఇచ్చారని చదివి ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. రవ్వల కొండ సంపదను బీసీ జనార్దన్ రెడ్డి దోచుకుంటే మా మీద నెపం వేస్తున్నారు ఎందుకు? అని ప్రశ్నించారు. రవ్వల కొండపై ఉన్న మోడల్ స్కూల్ పిల్లలను.. తలుపుకొట్టి లేసి.. జనార్దన్ రెడ్డి మైనింగ్ బ్లాస్టింగ్ చేసింది వాస్తవం కాదా? అని అడిగినా చెబుతారని తెలిపారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. గతంలో బీసీ జేఆర్ అనే కాంట్రాక్టు సంస్థను పెట్టుకొని, రవ్వల కొండ, గాలేరు-నగరి, కంకర రాయిని అడ్డంగా దోచుకున్నారని ఆరోపణలు చేశారు.
Read Also: Pooja Hegde : కొబ్బరి చెట్ల మధ్య హంసలా మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..
ఇక, సామాజిక న్యాయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.. స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. కాగా, పాణ్యం ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.. కాటసాని రాంగోపాల్‌రెడ్డి కలెక్షన్ కింగ్ అని విమర్శించిన ఆయన.. కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ (కేజీఎఫ్)గా మార్చారు.. 500 ఎకరాల జగన్నాథగుట్ట భుముల్ని కొట్టేశారని.. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వల కొండను బనగానపల్లి ఎమ్మెల్యే రామిరెడ్డి మింగేశారని వ్యాఖ్యానించిన విషయం విదితమే.