Site icon NTV Telugu

Balram Naik : ఎంపీ సోయం బాబు రావు చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలి

Balaram Naik

Balaram Naik

బీజేపీ ఎంపీ సోయం బాబు రావు చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బలరాం నాయక్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లంబాడీ, కోయ కమ్యూనిటీ వేరు వేరు కాదని, రాజ్యాంగం సవరణ చేశాక లంబాడీ లను ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. ఎస్టీ రిజర్వేషన్స్ నుంచి లంబాడీ కమ్యూనిటీ నుంచి తొలగించడం సాధ్యం కాదని, లంబాడీల ను ఎస్టీ ల నుంచి తొలగించాలంటే.. దేశంలో 21 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ రావాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ తీర్మానాలు కావాలని, ఇప్పుడు దేశంలో ఇది సాధ్యమేనా అని ఆయన అన్నారు.

Also Read : Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?

సోయం బాబు రావు మాటలు విద్వేషాలు రెచ్చగొట్టే లా ఉన్నాయని, సోయం బాబు రావు మాటలు విని ఎస్టీ నాయకులకు అవగాహన లేదని అందరూ అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలన్నా అవగాహన తో మాట్లాడాలని, ఎంపీగా ఉండి సోయం బాబు రావు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని, దీనిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమన్నారు బలరాం నాయక్‌. కేంద్రం నుంచి సబ్ ప్లాన్ నిధులు ఎన్ని వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది .. కేసీఆర్ ను అడిగే దమ్ము సోయం బాబు రావు కు ఉందా అని ఆయన సవాల్‌ విసిరారు. పార్లమెంట్ లో దీనిపై మాట్లాడగలరా అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?

Exit mobile version