NTV Telugu Site icon

Balmuri Venkat: బీఆర్ఎస్ మూడున్నరేళ్ల తర్వాతేకాదు…ముప్పై ఏళ్ల దాకా ప్రతిపక్షంలోనే…

Balmoori Venkat

Balmoori Venkat

కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. బీఆర్ఎస్ మూడున్నరేళ్ల తర్వాతేకాదు.. ముప్పై ఏళ్ల దాకా ప్రతిపక్షంలోనే ఉంటుందని తెలిపాడు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. మీరు చేసిన విధ్వంసానికి మళ్లీ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థి లేదు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారు. మూడున్నరేళ్ల తర్వాత భూములను గుంజుకుంటా అంటున్నడు.. 15నెలల కిందటే ప్రజలు నీ అధికారం గుంజుకున్నది మరిచిపోయినవా అని ప్రశ్నించారు.

Also Read:Hyderabad: భారీ వర్షం.. నగరం మొత్తం ట్రాఫిక్ జామ్..

గతంలో బీఆర్ఎస్ ధారాదత్తం చేసిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటదనేదే కేటీఆర్ భయం.. అందుకే అసత్య ప్రచారంతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారు.. కవిత, కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడుతున్నరు, వాళ్ల మధ్యే అధిపత్యపోరు నడుస్తోంది.. ధరణీపేరుతో రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూములను మాయం చేసిన చరిత్ర మీది.. హైదరాబాద్ చుట్టు విలువైన వందల ఎకరాల భూములను అమ్ముకున్న చరిత్రమీది.. మల్లన్న సాగర్ లో ఊర్లకు ఊర్లనే తీసేసిన చరిత్ర మీది.. కాళేశ్వరం కోసం 7వేల ఎకరాల అటవీ భూములు తీసుకున్నడది మీ ప్రభుత్వమే.. రాష్ట్రంలో లక్షల ఎకరాల దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను చరబట్టిన చరిత్రమీదని అన్నారు.

Also Read:Emergency Landing: ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకున్న 200 మంది భారతీయులు

ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులది.. ప్రైవేట్ వ్యక్తుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పాలకులది.. ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా 400 ఎకరాల భూమిని న్యాయ స్థానంలో కొట్లాడి ప్రభుత్వానికి దక్కేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది.. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భూమిని ప్రైవేట్ వాళ్ల చేతుల్లోంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న అసత్యప్రచారంపై యువకులు, నిరుద్యోగులే వారికి సమాధానం చెప్తారని బల్మూరి వెంకట్ వెల్లడించారు.