బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీస్ లు అట్టెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలన్నారు బల్మూరి వెంకట్. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీజేపీ నాయకులు ఇష్టంవచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని బీజేపీ నాయకులు భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Chit Fund Fraud: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.50 లక్షలతో పరారీ
ప్రజల్లో రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. లేదంటే బీజేపీ నాయకులను తిరుగనివ్వమని బల్మూరి వెంకట్ అన్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. దీంతో.. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా.. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు కాంగ్రెస్ నేతలు.
నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో.. నయనతార రొమాంటిక్ ఫొటోలు వైరల్!