Ballari Tension: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గురువారం అర్ధరాత్రి బళ్లారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులకు పాల్పడ్డాడు. గన్‌మన్ తుపాకీ లాక్కుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి 2 రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల నుంచి మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నాడు. ఇదే టైంలో ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు చెలరేగాయి. ఈ కాల్పుల కారణంగా ఒకరు మృతి చెందగా, ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్‌కు గాయాలు అయ్యాయి.
READ ALSO: Astrology: జనవరి 2, శుక్రవారం దినఫలాలు..
బళ్లారిలో మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఈ వివాదం చేలరేగి అది కాస్త.. కాల్పుల వరకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కోసం గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, దానికి గాలి అనుచరులు వద్దని వారించారు. ఇక్కడే వివాదం చెలరేగి, అది కాస్తా కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో జనార్ధన రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా పది మందికి పైగా కేసు నమోదైంది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు చానల్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఇరువర్గాల మధ్య గొడవ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇరువర్గాల మధ్య పరస్పరం రాళ్లు, బీరు బాటిళ్లు విసురుకున్నారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గాలి జనార్దన్ రెడ్డి భద్రత సిబ్బంది జరిపిన కాల్పుల్లో రాజశేఖర్ అనే వ్యక్తి చనిపోయినట్లు కాంగ్రెస్ సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చనిపోయిన రాజశేఖర్ రాళ్ల దాడిలో చనిపోయారా… లేదంటే బుల్లెట్ కారణంగా అని తెలియాల్సి ఉంది.
READ ALSO: OTR: బిఆర్ఎస్ ఎమ్మెల్యే & కాంగ్రెస్ సీనియర్ నేత కలసి ఇసుక దందా..!!