మంచిర్యాల జిల్లాలో కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ పై ఆగ్రవం వ్యర్తం చేశారు. సీఎం కేసీఆర్ ను పట్టుకుని ఆరే కేసీఆర్ అని మాట్లాడుతున్నారు.. వివేక్ మాట్లాడిన వీడియోను మీడియాను ముందు ఆయన వినిపించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన నాయకుడిని పట్టుకొని అలా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి లాంటి నాయకుడిపై మాట్లాడటం దుర్మార్గం.. మాకు మాట్లాడ వచ్చు.. కానీ సంస్కారం ఉంది.. ఓటమి భయంతో అట్లా వివేక్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వివేక్ సంస్థలోని ఉద్యోగులు చెన్నూర్ లోనే పని చేస్తున్నారు.. డబ్బులతో మా లీడర్లను కొంటున్నారు.. నేను అటు తిరిగితే ఇటు నాయకులను కొంటున్నారు అంటూ బాల్క సుమన్ మండిపడ్డారు.
Read Also: Divyavani: కాంగ్రెస్ గూటికి దివ్యవాణి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఠాక్రే
చెన్నూరులో ధన రాజకీయం చేస్తున్నారు అంటూ బాల్క సుమన్ అన్నారు. వివేక్ దొంగే.. దొంగా దొంగా అంటున్నారు.. వివేక్ షెల్ కంపెనీ 8 కోట్లు వచ్చాయి.. దానికి సమాధానం చెప్పాలి.. క్లార్క్ లను కంపెనీల్లో డైరెక్టర్ లుగా పెడతారా.. వివేక్ పై రైడ్స్ మాకేం సంబంధం.. మా లీడర్లపై ఐటీ సోదాలు జరిగాయి.. 27 తేదీన ప్రజా కోర్టులో వివేక్ కొనుగోలు చేసిన లీడర్ల లిస్టు బయట పెట్టుతాను అని ఆయన చెప్పుకొచ్చారు. దిగజారి రాజకీయాలు చేయలేదు.. వీళ్ళే తప్పు చేస్తారు.. దొరికి పోతారు.. మళ్ళీ మమ్మల్నీ అంటే ఎలా.. బీజేపీ వాళ్ళను వెన్ను పోటు పొడిచి వచ్చావు.. వాళ్లు ఎందుకు ఊరుకుంటారు.. వివేక్ పై ఈడీ సోదాలు సుమన్ కు సీఎం కేసీఆర్ కు ఏం సంబంధం అని సుమన్ ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధి పైన మాట్లాడు.. లేదా బహిరంగ చర్చకు దా.. వివేక్ కి అతనిపై అతనికే నమ్మకం లేదు.. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారితే జనం ఎలా నమ్మతారు.. వివేక్ ఖచ్చితంగా ఓడి పోతారు.. అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం అంటూ వివేక్ వెంకటస్వామికి బాల్క సుమన్ సవాల్ విసిరారు.