రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రస్తుత సర్వే ప్రకారం 94 సీట్లు వస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల హాయంలోనే సింగరేణి బొగ్గు బ్లాక్ ను వేలం వేశారన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 49 శాతం సింగరేణి వాటాను కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు, నాయకులు ఎన్ని దీక్షలు చేసిన కాంగ్రెస్ ఎంపీలకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అయిందని, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అని ఆయన విమర్శలు గుప్పించారు. నాలుగున్నర ఏళ్ల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల్లాగా ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తున్నారని, దయచేసి ప్రజలు ఆగం కావొద్దన్నారు బాల్క సుమన్.
Also Read : Viral Wedding Reception: కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త జంట
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలన్న తెలంగాణను ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చేసిన కెసిఆర్ నాయకత్వమే ఉండాలని, రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, కరోనా కష్ట కాలంలో… బిజెపి సహకరించక పోయిన వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి మందమర్రి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నేషనల్ హైవే పైన ఎక్కడ లేని విధంగా ఫిల్లర్లతో బ్రిడ్జి నిర్మించి 296 షాపులు కోల్పోకుండా నిర్మిస్తున్నామని, త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా మందమర్రి ఆర్ఓబిని, 500 ఓట్లతో ఫామాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేస్తామని, ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ నుండి 20 కోట్లు, ముఖ్యమంత్రిగా ఆశీస్సులతో 25 కోట్లు మొత్తం 45 కోట్లతో మందమర్రి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. త్వరలోనే 700 కోట్ల లాభాల బోనస్, 300 కోట్ల దీపావళి బోనస్, వేజ్ బోర్డ్ ఏరియర్స్ చెల్లిస్తామని, పాలకవర్గం లేకున్నా మందమర్రిలో నాయకులు అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తమకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారన్నారు.
Also Read : Health Tips: మహిళలకు అరికాళ్లల్లో ఎందుకు నొప్పి వస్తుందో తెలుసా?