Balka Suman Arrest: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతన్‌పల్లిలో హైడ్రామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman Arrest: మంత్రి వివేక్ వెంకట స్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావారణం కొనసాగుతోంది. పోలీసులు గేటు తీసుకుని లోపలికి వెళ్లే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
READ MORE: India AI Impact Summit 2026: న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో గందరగోళం.. వివాదంపై బీజేపీ రియాక్షన్..
Also Read
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
ఇదిలా ఉండగా.. అరెస్ట్‌కు ముందు బాల్క సుమన్ మాట్లాడుతూ.. “సభ్య సమాజం తలదించుకునే చర్యలు క్యాతన్‌పల్లిలో జరుగుతున్నాయి.. 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 7 వార్డులే గెలిచింది.. కానీ మేము, సీపీఐ పార్టీ కలిసి 14 గెలిచాం. మంత్రి వివేక్‌కు కలెక్టర్ కుమార్ దీపక్ తొత్తుగా మారారు. ఆర్‌ఓబి వద్ద ఆపారు. అందుకే నిరసన వ్యక్తం చేశాం. రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్ మంత్రి వివేక్ ఇంట్లో పని మనిషిలా మారారు. రాళ్ళు విసిరింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. మా నాయకుడు మూల రాజిరెడ్డి కారు ధ్వంసం అయింది. కొట్టింది పోలీసులు, రాళ్ళు వేసింది కాంగ్రెస్ వాళ్ళు.. కేసులు మా మీద వేస్తారా? కొంత మంది పోలీసులు ఊడిగం చేస్తున్నారు. సంఖ్యా బలం లేకున్నా క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ మున్సిపల్ హాల్‌లో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ముందే మా మహిళా కౌన్సిలర్లను తాకారు. దౌర్జన్యం మంత్రే చేసి నన్నే రౌడీ అంటున్నారు.
రౌడీయిజం చేస్తున్నది మంత్రి వివేక్, ఆయన కొడుకే. ఈ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నారు. మేము అధికారంలో ఉండగా ఎప్పుడైనా బెదిరించామా.. దాడులు చేసామా? జైల్లో పెట్టామా? ప్రజా తీర్పులో మంత్రి వివేక్ అపహాస్యం చేస్తున్నారు కాబట్టి మేము నిలదీస్తున్నాం. మీరు మీ కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడులు చేయిస్తారా? కేసులకు భయపడేది లేదు.. జైల్లో పెట్టినా సరే.. ప్రజల కోసం గట్టిగా కొట్లాడుతాం.” అని బాల్క సుమన్ తెలిపారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!