NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు.. నేను పార్టీ మారను..

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాసుకుంటున్నారు. నేను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని కొట్టిపారేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. అసలు నేను ఏ మీడియాతో మాట్లాడలేదన్నారాయన.. ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేది నా ఆశ అన్నారు.. ఎంపీ సీటు విషయంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందనే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం ప్రయత్నం చేశా.. మిగతా నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనట్లున్నారు.. అధిష్టానం దృష్టిలో నేను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోంది.. నేను అందరి శ్రేయస్సు కోసం అడుగుతున్నా.. మిగతావాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు..? అని ప్రశ్నించారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

Read Also: Virat Kohli Brother: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు!

నా ఒంగోలు నియోజకవర్గ పేదల పట్టాల కోసం ప్రయత్నం చేసుకున్నా.. వాళ్లు పట్టించుకొనప్పుడు నాకు మాత్రం ఎందుకు..? అని ఎదురు ప్రశ్నించారు బాలినేని.. నేను సీఎం వైఎస్‌ జగన్‌ పిలిస్తే వెళ్లనన్నానని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. నేను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమన్న ఆయన.. నేను ఏ మీడియాతో మాట్లాడలేదు.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాసుకుంటున్నారు. నేను ఒంగోలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. ఇక, ఏ ఎంపీ అభ్యర్ధి వచ్చినా నాకు ఏ అభ్యంతరం లేదు.. నా పని నేను చేసుకుంటానని తెలిపారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.